Telangana : నేడు మరోసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత కపిల్ సిబల్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలను కలిసే అవకాశముంది. రాష్ట్రంలో నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సాధించిన విజయంపై ఆయన వివరించే అవకాశాలున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలపై...
మరొకవైపు ఈ నెల 17వ తేదీన మంత్రి వర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినిర్ణయించారు. పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారు. దీనిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశముంది.