Revanth Reddy : నేడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి బయలుదేరి ఢిల్లీ చేరుకున్న రేవంత్ రెడ్డి నేడు యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సదస్సులో వివరించనున్నారు.
పెట్టుబడుల కోసం...
తమ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు తీసుకుంటున్న చర్యలు, మౌలిక వసతుల కల్పనపై ఆయన సదస్సులో ప్రసంగించనున్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు ఢోకా ఉండదన్న భరోసా ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను కూడా సదస్సులో వివరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తిచేయాలని కోరనున్నారు.