నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు.

Update: 2021-11-21 03:24 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రంతో అమితుమీ తేల్చుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ దొరికితే ఆయనతో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రులను కూడా కలిసేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నారు.

కేంద్ర మంత్రులను...
తెలంగాణలో యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఆయన ఢిల్లీలోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు, రేపు కూడా ఢిల్లీలోనే కేసీఆర్ ఉండి పలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.


Tags:    

Similar News