నేడు యాదాద్రికి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి ఆలయ పనులను పరిశీలించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి ఆలయ పనులను పరిశీలించనున్నారు. వచ్చే నెలలోనే యాదాద్రి ఉద్ఘాటన జరగనుండటంతో పనులను స్వయంగా పరిశీలించేందుకు నేడు కేసీఆర్ యాదాద్రి వస్తున్నారు. ఉదయం 11 గంటలకు యాదాద్రి చేరుకుని సుదర్శనయాగం ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు, వేద పండితులతో చర్చించనున్నారు. అక్కడ ఆలయ పనులను వేగవంతం చేయాలని ఆదేశించనున్నారు.
వచ్చే నెలలోనే...
మార్చి 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ యాదాద్రి ఉద్ఘాటన కార్యక్రమాలు జరగనున్నాయి. యాదాద్రి పుణ్య క్షేత్రం పునర్నిర్మాణం పనులను వేగవంతం చేయాలని సూచించనున్నారు. ఇప్పటికే యాదాద్రి పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి కావడానికి కొంత సమయం పట్టేలా ఉంది. మెట్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కాటేజీల నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి. వీటన్నింటిపై కేసీఆర్ నేడు సమీక్షించనున్నారు.