యాదాద్రిలో కేసీఆర్... కలియ తిరుగుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. ఆలయ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. ఆలయ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. హెలికాప్టర్ లో తొలుత ఆయన ఏరియల్ రివ్యూద్వారా పనులను చూశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. మార్చి 21 నుంచి మార్చి 28వ తేదీ వరకూ ఆలయ ఉద్ఘాటన జరగనుంది. మహా సుదర్శన యాగం కూడా నిర్వహిస్తున్నారు.
సుదర్శన యాగంపై....
మహా సుదర్శన యాగం ఏర్పాటుపై కూడా కేసీఆర్ సమీక్షిస్తున్నారు. యాదాద్రి వచ్చిన కేసీఆర్ ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఆలయ ప్రాంగణంలో కలియ తిరిగారు. పనుల పురోగతిని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ వెంట మంత్రులు జగీష్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ లు కూడా వచ్చారు.