కమాండ్ కంట్రలో సెంటర్ ప్రారంభం

హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.

Update: 2022-08-04 07:52 GMT

హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి ప్రారంభించారు. 600 కోట్లతో నిర్మించిన ఈ అత్యాధునిక భవనానికి 2016 లో శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలో ఆరు టవర్లతో కూడిన కమాండ్ కంట్రోల్ రూం నిర్మాణం అయింది. అత్యాధునిక హంగులతో దీనిని నిర్మించారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణం జరిగింది. ఒకే చోట నుంచి నగరం మొత్తం వీక్షించే అవకాశముంది. లక్ష కెమెరాలను ఒకే చోట చూసేలా భారీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కే కాదు దేశానికే ఈ కమాండ్ కంట్రోల్ రూం ఒక ఆదర్శంగా నిలుస్తుంది.

అన్ని విభాగాలు...
పోలీసు శాఖలోని అన్ని విభాగాలు ఈ భవనంలోనే ఉంటాయి. సమన్వయం కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణ చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. అన్ని సౌకర్యాలు ఇందులో సమకూర్చారు. సామాన్యులు కూడా ఈ భవనాన్ని దర్శించుకునే వీలును కల్పించారు. ఆరు లక్షల చదరపు అడుగులలో ఈ టవర్ల నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News