ప్రజాప్రతినిధులతో ఢిల్లీకి కేసీఆర్.. ఎప్పుడంటే?
ప్రజాప్రతినిధులందరితో కలసి ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
ప్రజాప్రతినిధులందరితో కలసి ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 29వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో పండుతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ప్రజాప్రతినిధులతో కలిసి కేసీఆర్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కు దిగనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. కేంద్రప్రభుత్వ వైఖరిపై ఢిల్లీ స్థాయిలో గళమెత్తేందుకు కేసీఆర్ మరో సారి సిద్ధమయ్యారు.
అదేరోజున....
29వ తేదీన దీక్షా దివస్ కావడంతో అదే రోజున ఢిల్లీలో ధర్నాకు దిగాలని కేసీఆర్ నిర్ణయించారు. అదేరోజు పార్లమెంటు సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ధర్నా చేస్తారా? లేక స్థానిక ప్రజాప్రతినిధులందరితో కలసి ఢిల్లీకి వెళ్లనున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.