ఢిల్లీలో బిజీబిజీగా కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీలో బిజీబిజీ షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీలో బిజీబిజీ షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో వరి ధాన్యం కొనుగోలుపై మాట్లాడేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. వరి ధాన్యం కొనుగోలుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన విషయాలను మాట్లాడేందుకు ఆయన ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.
నేడు కేంద్ర మంత్రులను....
మరోవైపు నేడు కేసీఆర్ కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ముఖ్యంగా జలవనరుల శాఖ మంత్రిని ఆయన కలిసే అవకాశముంది. గోదావరి నదిపై కొత్త ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయడం, నదీ జలాల పంపిణీ తదితర అంశాలపై కేసీఆర్ కేంద్రమంత్రితో చర్చించనున్నారు.