Revanth Reddy : నేడు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు

Update: 2025-12-16 03:54 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గత మూడు రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ పెద్దలను కలసి ఇప్పటికే రాజకీయ అంశాలపై చర్చించారు. ప్రధానంగా మంత్రి వర్గ విస్తరణ వంటి విషయాలను పార్టీ హైకమాండ్ వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ పదవుల భర్తీపై కూడా చర్చించారని తెలిసింది.

కేంద్ర మంత్రులను కలసి...
ఈరోజు ఢిల్లీలోరేవంత్ రెడ్డి పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందని తెలిసింది. పార్లమెంటుకు వెళ్లి కేంద్ర మంత్రులను కలవనున్నారని సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించడమే కాకుండా నిధుల విషయంలోనూ కేంద్ర మంత్రులకు వినతి పత్రాలను అందించనున్నారు. మూసీ రివర్ ప్రక్షాళన, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి వాటి విషయాలను ప్రస్తావించనున్నారు.


Tags:    

Similar News