Telangana : నేడు మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం
నేడు మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది
నేడు మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారానికి ఇప్పటికే మంత్రులు కొందరు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలపై మంత్రివర్గ సమావేశం చర్చించనుంది. మేడారంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి చేరుకోనున్నారు.మేడారం మాస్టర్ ప్లాన్‌పై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరొకవైపు జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై చర్చ జరగనుంది.
కీలక అంశాలపై చర్చించి...
ఐదు గంటలకు స్థానిక హరిత హోటల్ లో మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కానుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పలు కీలక అంశాలపై నేటి మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. మేడారంలో తొలిసారి మంత్రి వర్గ సమావేశం జరగనుండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాట్లు చేశారు. ట్రాన్స్ జెండర్లను కో - ఆప్షన్ సభ్యలుగా నియమించడంపై చర్చించి ఆమోదించనుంది.