Telangana : రేపు మేడారంలో తెలంగాణ కేబినెట్‌ సమావేశం

రేపు మేడారంలో తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది.

Update: 2026-01-17 04:18 GMT

రేపు మేడారంలో తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. మేడారం హరిత హోటల్‌లో రేపు సాయంత్రం ఐదు గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది.సచివాలయం బయట తొలిసారి కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

కీలక భేటీ...
ఈ సమావేశంలో మేడారం మాస్టర్ ప్లాన్‌పై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. కొన్ని కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం లభించనుంది. మరొకవైపు జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై చర్చ జరగనుంది.


Tags:    

Similar News