Telangana : రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమవేశాలు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు

Update: 2025-03-11 02:34 GMT

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. బడ్జెట్ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్నది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు బీసీలకు 42 శాత రిజర్వేషన్ల బిల్లును పెట్టి ఆమోదించనున్నారు.

వ్యూహ ప్రతి వ్యూహాలు...
సభలో చర్చించి కేంద్రానికి తీర్మానం చేసి పంపనున్నారు. దీంతో అధికార, విపక్ష పార్టీలు బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ముందస్తు సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. విపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని అధికార పార్టీ, అధికార పార్టీని రైతాంగ సమస్యలపై నిలదీయాలని విపక్షం సిద్ధమవుతుంది. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. ఈ సమావేశాలు మొదటి రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు.


Tags:    

Similar News