Telangana : నేడు బీజేపీ శాసనసభపక్ష సమావేశం

తెలంగాణ బీజేపీ శాసనసభపక్ష సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నిర్ణయించనుంది

Update: 2025-08-29 05:52 GMT

తెలంగాణ బీజేపీ శాసనసభపక్ష సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నిర్ణయించనుంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షత వహించారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో చర్చించాల్సిన అంశాలపై నేటి భేటీలో పార్టీనేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో...
రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిర్వేషన్ల అమలు, ఇటీవల సంభవించిన వరదలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థల విషయంలో అవలంబిస్తున్న వైఖరితో పాటు వరద సాయం వెంటనే ప్రకటించాలని బీజేపీ శాసనసభ్యులు డిమాండ్ చేయనున్నారు.


Tags:    

Similar News