Telangana : బీజేపీ నేతల కీలక నిర్ణయం

తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. అఖిలపక్ష సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరు కాకూడదని నిర్ణయించింది

Update: 2025-03-08 05:20 GMT

తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరు కాకూడదని నిర్ణయించింది. ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఅధ్యక్షతన ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి సమాచారం పంపారు.

అఖిలపక్ష సమావేశానికి...
కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులతో పాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించడానికి ప్రభుత్వం అఖిలపక్ష పార్టీ సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీజేపీ హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఈ మేరకు కిషన్ రెడ్డి బహిరంగ లేఖను మల్లు భట్టి విక్రమార్క రాశారు. భవిష్యత్ లో ఇలాంటి సమావేశాలను నిర్వహిస్తే ముందుగా సమాచారాన్ని తెలియజేయాలని కోరారు.


Tags:    

Similar News