Telangana : నేడు నాలుగో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు నాలుగో రోజు జరగనున్నాయి.

Update: 2026-01-05 02:44 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు నాలుగో రోజు జరగనున్నాయి. నేడు హిల్ట్ పాలసీపై చర్చ జరగనుంది. దీంతో పాటు ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదించుకోనుంది. ప్రధానంగా హిల్ట్ పాలసీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు తెలగాణ ప్రభుత్వం దీనిపై చర్చ పెట్టాలని నిర్ణయించింది.

హైదరాబాద్ ను కాలుష్య రహితంగా...
హిల్ట్ పాలసీని తమ ప్రభుత్వం ఎందుకు తీసుకు వచ్చింది? హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంలో తీర్చిదిద్దడానికే ఈ పాలసీని తెచ్చినట్లు పేర్కొననుంది. బీఆర్ఎస్ ఈ అసెంబ్లీ సమావేశాలను మాత్రమ బహిష్కరించింది. అయితే బీజేపీ కూడా హిల్ట్ పాలసీపై అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ సభలో చేసిన విమర్శలకు ప్రభుత్వం ఏ సమాధానం ఇస్తుందో చూడాలి.


Tags:    

Similar News