Telangana : నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు మూడో రోజు ప్రారంభం కానున్నాయి.

Update: 2026-01-03 02:28 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు మూడో రోజు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కృష్ణా జలాల వివాదంపై శాసనసభలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇవ్వనున్నారు.

కృష్ణా జలాల కేటాయింపులు...
కృష్ణా జలాల కేటాయింపులు.. ఎవరి ప్రభుత్వ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగింది? పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అందించనున్నారు. అనంతరం కృష్ణా జలాలపై చర్చ జరగనుంది. అయితే బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించనున్నారు.


Tags:    

Similar News