Telagnana : ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల7వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది
Assembly Meetings Speaker Election
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల7వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో కులగణన అంశంపై జరిగిన సర్వేకు ఆమోదం తెలిపేందుకు ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో తెలంగాణ మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించ వచ్చా? లేదా? అన్న దానిపై తర్జన భర్జన జరుగుతోంది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున...
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కేబినెట్ భేటీ జరపవచ్చా? లేదా? అన్నది లేఖ రాసి క్లారిటీ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులగణన సర్వేకు ఆమోదం తెలపాలని భావిస్తుంది. అయితే ఫిబ్రవరి 5వ తేదీన తెలంగాణ మంత్రి వర్గ సమావేశంపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.