Telangana Elections Updates: ఏ జిల్లాలో ఎంత పోలింగ్‌ శాతం.. పూర్తి వివరాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇక ఫలితాలు రావడమే తరువాయి. అయితే పోలింగ్‌ ముగియనేగా ఎగ్జిట్‌ పోల్స్‌ ..

Update: 2023-12-01 04:22 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇక ఫలితాలు రావడమే తరువాయి. అయితే పోలింగ్‌ ముగియనేగా ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల అయ్యాయి. ఈ ఫలితాలు అధికంగా కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ సారి పోలింగ్‌లో అన్ని ప్రాంతాల్లో భారీగానే పోలింగ్‌ శాతం నమోదైంది.

కొన్ని ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్న రాత్రి వరకు జరిగిన మొత్తం పోలింగ్ శాతం 70.60గా వెల్లడించారు ఎన్నికల అధికారులు. అత్యధికంగా యాదాద్రిలో 90.03శాతం నమోదు కాగా.. హైదరాబాద్‌లో అత్యల్పంగా 46.56 శాతం నమోదైంది. మరి జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం ఎలా ఉందో తెలుసుకుందాం.

జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం..

☛ అదిలాబాద్ – 79.86

☛ భద్రాద్రి – 78.65

☛ హనుమకొండ – 66.38

☛ హైదరాబాద్ – 46.56

☛ మెదక్ – 86.69

☛ మేడ్చల్ – 56

☛ జగిత్యాల – 76.10

☛ జనగాం – 85.74

☛ భూపాలపల్లి – 81.20

☛ గద్వాల్ – 81.16

☛ కామరెడ్డి – 79.59

☛ కరీంనగర్ – 74.61

☛ ఖమ్మం – 83.28

☛ ఆసిఫాబాద్ – 80.82

☛ మహబూబాబాద్ – 83.70

☛ సిరిసిల్ల – 76.12

☛ సిద్దిపేట – 79.84

☛ మహబూబ్‌నగర్ – 77.72

☛ మంచిర్యాల – 75.59

☛ ములుగు – 82.౦9

☛ రంగారెడ్డి – 59.94

☛ సంగారెడ్డి – 76.35

☛ నగర్ కర్నూల్ – 79.46

☛ నల్గొండ – 85.49

☛ నారాయణపేట – 76.74

☛ నిర్మల్ – 78.24

☛ నిజామాబాద్ – 73.72

☛ పెద్దపల్లి – 76.57

☛ సూర్యాపేట – 84.83

☛ వికారాబాద్ – 76.47

☛ వనపర్తి – 77.64

☛ వరంగల్ – 78.06

☛ యాదాద్రి – 90.03

Tags:    

Similar News