KCR: పోలింగ్‌ తర్వాత మంత్రులతో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో తాము మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హ్యట్రిక్‌ కొట్టడం ఖాయమని...

Update: 2023-12-01 10:12 GMT

తెలంగాణలో తాము మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హ్యట్రిక్‌ కొట్టడం ఖాయమని, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని గులాబీ బాస్‌ భరోసా ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ప్రగతి భవన్‌లో దాదాపు 25 మంది మంత్రులను కేసీఆర్‌ కలిశారట. మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వారందరికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రులతో పోలింగ్‌ జరిగిన తీరు గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌ను నమ్మవద్దని, ఎవ్వరు కూడా ఆగమాగం కావద్దు.. అంటూ నేతలకు కేసీఆర్‌ సూచించినట్లు తెలుస్తోంది.

3వ తేదీన సంబరాలు చేసుకుందామని చెప్పారట. ఎగ్జిట్‌ పోల్స్‌ను చూసి ఎవ్వరు కూడా అధైర్య పడవద్దు.. మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్‌ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత తాను ప్రశాంతంగా నిద్రపోయానని ఆయన twitterలో పోస్టు చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మవద్దని, గతంలో కూడా ఇలాంటివి చాలా చూశామని, మరోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే. 3వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడంతో ప్రజలలో మరింత ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News