బీఆర్ఎస్ పై కడియం రివర్స్ అటాక్

బీఆర్ఎస్ పై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన కామెంట్స్ చేశారు.

Update: 2025-09-19 07:39 GMT

బీఆర్ఎస్ పై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన కామెంట్స్ చేశారు. గతంలో 36 మంది ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని, ఒక్కరి మీదనైనా అనర్హత వేటు వేశారా? అని ప్రశ్నించారు. స్పీకర్ కు నాడు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా అనర్హత వేటు వేయలేదని కడియం శ్రీహరి అన్నారు. స్పీకర్ కు నేడు కూడా సుప్రీంకోర్టు సూచనలు చేసిందని, ఆదేశాలు ఇవ్వలేదని కడియం శ్రీహరితెలిపారు.

పదవులు పొందలేదంటూ...
తాను పార్టీ పదవులు పొందలేని కడియం శ్రీహరి తెలిపారు. నాడుపార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలేదో చెప్పాలంటూ కడియం శ్రీహరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నిలదీశారు. స్పీకర్ తనకు ఇచ్చిన నోటీసులపై స్పందిస్తూ వివరణ ఇచ్చేందుకు ఇంకాసమయం ఉందని, తాను వివరణ ఇస్తానని కడియం శ్రీహరి తెలిపారు.


Tags:    

Similar News