Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో.. విచారణ కు షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ గడ్డం ప్రసాదరావు వేగవంతం చేశారు.

Update: 2025-09-27 12:27 GMT

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ గడ్డం ప్రసాదరావు వేగవంతం చేశారు. సుప్రీంకోర్టు మూడు నెలల్లో విచారణ జరిపి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడంతో ఆయన గత కొద్ది రోజుల నుంచి పదిమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ మార్పుపై విచారణ ప్రారంభించారు. ఇప్పటికే అందరికీ నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలను విచారించడానికి స్పీకర్ గడ్డం ప్రసాదరావు సిద్ధమయ్యారు. గతఎన్నికల్లో గెలిచి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నుంచి స్పీకర్ కార్యాలయం ఇప్పటికే వివరణ తీసుకుంది.

పది మంది ఎమ్మెల్యేలలో...
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రడ్డి, గూడెం మహీపాల్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, అరికెపూడి ాంధఈ ఉన్నారు. వీరందరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. సుప్రీంకోర్టులో పలు మార్లు విచారించి స్పీకర్ కార్యాలయానికి నోటీసులు కూడా జారీ చేసింది. స్పీకర్ కు అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు మూడు నెలలు సమయం తీసుకోవాలని కోరింది. దీంతో వారికి నోటీసులు జారీచేసి విచారణ ప్రారంభించనున్నారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని లిఖితపూర్వకంగా తెలిపారు.
ఈ నెల 29వ తేదీన...
అయితే తాజాగా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు తమ వాదనలను స్పీకర్ కార్యాలయంలో వినిపించుకునేందుకు స్పీకర్ గడ్డం ప్రసాదరావు షెడ్యూల్ ను విడుదల చేశారు.రు. ఈ నెల 29వ తేదీ నుంచి విచారణ ప్రారంభం కానంుది. 29వ తేదీన ఉదయం పదకొండు గంటలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు సంబంధించి విచారణ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలెయాదయ్య, మధ్యాహ్నం ఒంటి గటకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, మూడు గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ ఉండనుంది. ఈ విచారణకు సంబంధించి ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు హాజరై వాదనలను వినిపించేంందుకు అవకాశం కల్పించారు. మరి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Tags:    

Similar News