రేవంత్ బ్లాక్ మెయిలర్.. ఛీటర్

టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కు తెలంగాణలో లేదని సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.

Update: 2022-11-22 07:48 GMT

టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కు తెలంగాణలో లేదని సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. రేవంత్ వైఖరి సరిగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ మర్రి శశిధర్ రెడ్డి టీఆర్ఎస్ తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ కు కుదుర్చుకుందని ఆయన ఆరోపించారు. హోంగార్డు ఎప్పుడూ ఐపీఎస్ కాలేడన్న రేవంత్ వ్యాఖ్యలు తనను బాధించాయని ఆయన తెలిపారు. రెవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ చీటర్ అని మర్రి శశిధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన రాజీనామాకు గల కారణాలను సోనియాగాంధీకి లేఖ రాస్తానని ఆయన తెలిపారు.

నమ్మే స్థితిలో లేరు...
వీహెచ్ ను కూడా గోడకేసి కొడతానని అనడం సరికాదని ఆయన అన్నారు. మునుగోడు సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అద్దంకి దయాకర్ చేత తిట్టించారని ఆయన ఆరోపించారు. దయాకర్ తో అలా అనిపించాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు రెడ్లే దిక్కు అనడం తప్పు అని అన్నారు. హుజూరాబాద్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. వెలమలను ఓడించాలంటే రెడ్లతోనే సాధ్యమవుతుందన్న రేవంత్ వ్యాఖ్యలు తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో ఘోర పరాభావం చూసిందన్నారు. ఓటములపై సమీక్షలు లేవని, అసలు చర్చే జరపలేదని ఆయన అన్నారు.


Tags:    

Similar News