Telangana : కాంగ్రెస్ పార్టీలో విషాదం.. సీనియర్ నేత మృతి
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి చెందారు
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన నల్గొండ జిల్లా నుంచి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలను ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీ మంత్రిగా పనిచేశారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో 1952 సెప్టంబరు 14వ తేదీన జన్మించారు. దామోదర్ రెడ్డి అంత్యక్రియలు అక్టోబర్ 4 సాయంత్రం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్వహించనున్నారు.