ఆర్టీసీ బస్సుల్లో సీట్ బెల్ట్
ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్‌తోపాటు పక్కన ఉండే సింగిల్ సీటుకు కూడా సీటు బెల్టును తప్పనిసరి చేశారు.
Seat belts.
ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్‌తోపాటు పక్కన ఉండే సింగిల్ సీటుకు కూడా సీటు బెల్టును తప్పనిసరి చేశారు. డిపో మేనేజర్లు యుద్ధప్రాతిపదికన అన్ని బస్సుల్లో డ్రైవర్ సీటుకు, ముందుండే ప్రయాణికుల సీటుకు బెల్టులు బిగిస్తున్నారు. కారు డ్రైవర్ సీటు బెల్టు ధరించకుంటే జరిమానా విధిస్తున్న పోలీసులు, ఆర్టీసీ బస్సుల విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఆర్టీసీ నుంచి సీటు బెల్టులకు సంబంధించిన వివరాలు కోరారు. ప్రస్తుతం కొత్త ఆర్టీసీ బస్సులకు బెల్టులుంటున్నా వాటిని డ్రైవర్లు వినియోగించకపోవడంతో అవి ఊడిపోతున్నాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయట్లేదు. ఆర్టీఐ కింద వచ్చిన అర్జీకి అధికారికంగా సమాధానం ఇవ్వాల్సి ఉన్నందున నిబంధనలను పాటించట్లేదని ఆర్టీసీ అధికారికంగా ఒప్పుకున్నట్టవుతుంది. అందుకే వెంటనే అన్ని బస్సుల్లో సీటు బెల్టు నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు డిపో మనేజర్లను ఆదేశించారు.