Telangana: నేటి నుంచి సరస్వతి పుష్కరాలు
తెలంగాణలో నేటి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో నేటి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో నేటి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సరస్వతి నది పుష్కరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అంతర్వాహినీ సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాలు నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ జరగనున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా అన్ని ఏర్పాట్లు చేసింది.
సాయంత్రం కాళేశ్వరానికి రేవంత్ రెడ్డి...
ప్రత్యేక నిధులను కేటాయించింది. ప్రత్యేక పూజలతో నేడు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం చేరుకుని షుష్కర స్నానం చేయనున్నారు. కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను టీజీఆర్టీసీ ఏర్పాటు చేసింది. రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి త్రివేణి సంగమం వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీసులతో పాటు గజఈతగాళ్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు.