ఏడో రోజుకు చేరిన సరస్వతి పుష్కరాలు
సరస్వతి పుష్కరాలు తెలంగాణలో ఏడో రోజుకు చేరుకున్నాయి.
సరస్వతి పుష్కరాలు తెలంగాణలో ఏడో రోజుకు చేరుకున్నాయి. కాళేశ్వరానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. త్రివేణి సంగమంలో స్నానమాచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులతో ఈ ప్రాంతమంతా కిటకిట లాడుతుంది.
అన్ని ఏర్పాట్లు...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం లో జరుగుతన్న సరస్వతి పుష్కరాలకు ప్రభుత్వం భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేసింది. మహిళ భక్తులు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.