Kaleswaram : మేడిగడ్డ పునాదుల నుంచి తొలగించాల్సిందే : కమిటీ నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టు పై సేఫ్టీ అధారిటీ సంచలన నివేదిక ఇచ్చింది. బ్యారేజీ ప్లానింగ్ డిజైన్ సరిగా లేదని తెలిపింది.

Update: 2023-11-03 07:59 GMT

  Medigadda project in Telangana

కాళేశ్వరం ప్రాజెక్టు పై సేఫ్టీ అధారిటీ సంచలన నివేదిక ఇచ్చింది. బ్యారేజీ ప్లానింగ్ డిజైన్ సరిగా లేదని తెలిపింది. మొత్తం బ్యారేజీని పునాదుల నుంచి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలని నివేదికలో పేర్కొంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమ్యలను ఎదుర్కొనే అవకాశముందని పేర్కొంది. డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణ:గా బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని, దీని ఫలితంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశముందని తెలిపింది. ప్రజల జీవితాలకు మాత్రమే కాకుండా భవిష్యత్ లో ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని నివేదిక పేర్కొంది.

లోపాలు ఇవే...
ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ తో పాటు ఆపరేషన్ మెయిన్‌టెయినెన్స్ విషయాల్లో వైఫల్యం వల్లనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణమని సేఫ్టీ అధారిటీ తన నివేదికలో పేర్కొంది. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం కారణంతో పాటు ఫౌండేషన్ మెటీరయల్ సామర్థ్యం కూడా తక్కువగా ఉందని తెలిపింది. బ్యారేజీ లోడ్ వల్ల ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్లనే పిల్లర్ సపోర్టు బలహీనపడిందని కమిటీ తన నివేదికలో తెలిపింది. తాము కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, తాము ఇరవై అంశాలు అడిగితే కేవలం పన్నెండు అంశాలకు మాత్రమే సమాధానం వచ్చిందని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్తిగా ఉందని కూడా తెలిపింది.


Tags:    

Similar News