Telangana : రైతుల భరోసాపై బిగ్ అప్ డేట్

రైతు భరోసా నిధులు విడుదలవుతున్నాయి. నిన్నటి నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి

Update: 2025-06-19 02:23 GMT

రైతు భరోసా నిధులు విడుదలవుతున్నాయి. నిన్నటి నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నిన్నటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. నాలుగు ఎకరాల భూమి ఉన్న వారికి మొదట రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఇప్పటి వరకూ 6.33 లక్షల మంది రైతులకు 1,313 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.

ఇప్పటి వరకూ...
మొత్తం 21.89 లక్షల ఎకరాలకు సంబంధంచిన రైతులు రైతు భరోసా నిధులు పొందారు. ఇప్పటి వరకూ 5,215 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తద్వారా 58 లక్షల మంది రైతులు లబ్డిపొందారు. మిగిలిన వారికి కూడా విడతల వారీగా ప్రభుత్వం సాయం అందించనుంది. ఖరీఫ్ సాగు పనులు ప్రారంభం కావడంతో రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.


Tags:    

Similar News