ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు

పెనుబల్లి వీఎం బంజర సమీపంలో రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఎదురుగా వస్తున్న లారీని మరో లారీ ఢీ కొట్టింది

Update: 2023-06-01 02:49 GMT

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఓ ప్రమాదం జరిగింది. కొణిజర్ల దగ్గర లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు వైరా మండలం విప్పలమడక వాసులుగా గుర్తించారు. మృతులు పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు, వారి కుమారుడు అశ్విత్ 13 గా గుర్తించారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్న రాజేష్ వైరా మండలం విప్పలమడక స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మరికాసేపట్లో ఇంటికి చేరుతారనగా ఈ దారుణం చోటు చేసుకుంది.

మరో ఘటనలో.. పెనుబల్లి వీఎం బంజర సమీపంలో రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఎదురుగా వస్తున్న లారీని మరో లారీ ఢీ కొట్టింది. దీంతో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. వాటిలో రెండు లారీల డ్రైవర్లిద్దరూ ఇరుక్కుపోయారు. బయటికి రాలేక, ఊపిరి ఆడక రెండు గంటలపాటు నరకం చూశారు. రెస్క్యూ టీమ్స్ వీరిని బైటకి తీసిన కాసేపటికే వీరిద్దరూ మృతి చెందారు. కల్లూరు మండలం రంగంబంజరలో చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయితేజ అనే యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తూరుబాక, నరసాపురం గ్రామాల మధ్య భద్రాచలం, చర్ల ప్రధాన రహదారిపై రోడు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ఆటోను ఢీకొనగా ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. భద్రాచలం నుంచి వస్తున్న ఆటోను.. నడికుడి గ్రామానికి చెందిన కాకా రాంబాబు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై భద్రాచలం వెళ్తుండగా ఎదురు వస్తున్న ఆటోని వేగంగా ఢీకొట్టాడు. ఆటోలో ప్రయాణిస్తున్న పినపాక మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన సోయం శ్రీహరి (50) అక్కడికక్కడే మృతి చెందగా, అదే మండలానికి చెందిన పలువురికి గాయాలయ్యాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న కాకా రాంబాబుతో పాటు మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News