Telangana : తెలంగాణలో ఆర్టీసీ బస్సు ను ఢీకొన్న టిప్పర్ .. ఇద్దరు మృతి
తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కక్కడే మృతి చెందారు.
తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కక్కడే మృతి చెందారు. టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఆర్టీసీ బస్సు వెళుతుండగా కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొట్టింది. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, ఇరవై మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. కంకర లోడుతో వెళుతున్న లారీ మితి మీరిన వేగంతో వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
70 మంది ప్రయాణికులతో...
ఈ ఆర్టీసీ బస్సు వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్సులో ఒకరు చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది వరకూ ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు, అటు వెళుతున్న వాహనదారులు సహాయక చర్యల్లో పాల్లొన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీంతో ఈ ప్రమాదంతో ఆ రూట్ లో రెండు నుంచి మూడు కిలోమీటర్ వరకూ ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు.