Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి

తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 24కు చేరింది

Update: 2025-11-03 04:45 GMT

తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 24కు చేరింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఆర్టీసీ బస్సు వెళుతుండగా కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొట్టింది. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవై నాలుగు మంది మరణించగా, ఇరవై మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి.

కంకర లోడు లారీ...
కంకర లోడుతో వెళుతున్న లారీ మితి మీరిన వేగంతో వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఆర్టీసీ బస్సు వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణికలు అధిక సంఖ్యలో చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డెబ్భయి మంది వరకూ ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు, అటు వెళుతున్న వాహనదారులు సహాయక చర్యల్లో పాల్లొన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.


Tags:    

Similar News