Revanth Reddy : వైఎస్ బాటను రేవంత్ ఎంచుకుంటున్నట్లుందిగా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్న మార్గంలో వెళుతున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్న మార్గంలో వెళుతున్నారు. దీంతో రేవంత్ ఏ ఎన్నికైనా సులువుగా ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే నేతలు, క్యాడర్ లో ఈ నమ్మకం కలిగింది. పార్లమెంటు ఎన్నికలతో పాటు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించుకున్నారు. పంచాయతీ ఎన్నికలలోనూ అత్యధిక స్థానాలను సాధించగలిగారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని ఎన్నిక ఏదైనా హస్తందే విజయం అన్న సంకేతాలను కేవలం ప్రత్యర్థులకు మాత్రమే కాదు.. సొంత పార్టీలోని తన నాయకత్వాన్ని వ్యతిరేకించే వారికి కూడా రేవంత్ పంపించారు. ఒకరకంగా పార్టీ అగ్ర నాయకత్వానికి కూడా రేవంత్ రెడ్డి తోనే కాంగ్రెస్ విజయాలు నమోదు చేసుకుంటుందన్న భావన కలిగించారు. టీడీపీ నుంచి వచ్చి పీసీసీ చీఫ్ అవ్వడమే తొలివిజయం. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో తనదే కీలక పాత్ర అని చెప్పగలిగారు.