Revanth Reddy : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి చేరుకోనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి చేరుకోనున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక విషయంలో మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా పర్యటించిన ఏఐసీసీ పరిశీలకులు జాబితాను సిద్ధం చేశారు. కాంగ్రెస్ ముఖ్య నేతల అభిప్రాయాలను కూడా సేకరించారు. ఈరోజు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం జరగనుంది.
నేడు క్లారిటీ వచ్చే అవకాశం...
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా రావాల్సిందిగా పిలుపు వచ్చింది. నిన్ననే డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై నేడు క్లారిటీ వచ్చే అవకాశముంది.