Telangana : నేడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. పార్లమెంటుకు వెళ్లి కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలిసే ఛాన్స్ ఉంది. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులతో పాటు వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. మూసీ ప్రక్షాళణ, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి సమస్యలను ప్రస్తావించనున్నారు.
కేంద్ర మంత్రులను కలిసి...
నిన్న మధ్యాహ్నం బయలుదేరి ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి కొందరు పార్టీ పెద్దలను కలిశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో పాటు పెట్టుబడులు భారీగా తరలి రావడంపై కూడా పార్టీ నేతలకు వివరించనున్నారు. ఇదే సమయంలో పార్టీ పరిస్థితులపై కూడా నేడు పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.