తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు కడుపు నింపే కబురు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు చెప్పింది

Update: 2025-01-21 06:13 GMT

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెంచాలంటే మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుందని తెలిసింది. ప్రస్తుతం పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజనం ప్రభుత్వం ఇస్తుంది. అయితే తాజాగా ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు చేయాలని భావిస్తుంది.

మధ్యాహ్న భోజనం...
ఏపీలో ఇటీవలే ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభమయిన నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఆదేశాలు వెళ్లాయని చెబుతన్నారు. తెలంగాణలో ఉన్న 425 ప్రభుత్వ కళాశాలల్లో సుమారు 1.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని నిర్ణయించారు. ఈచర్యతో హాజరు శాతం పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.


Tags:    

Similar News