Revanth Redddy : చేవెళ్ల బస్సు ప్రమాదంపై రేవంత్ దిగ్భ్రాంతి
చేవెళ్ల బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
చేవెళ్ల బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ బస్సు ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో ఇరవై మందకి గాయాలయ్యాయి. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గాయపడిన వారిని...
ప్రమాద వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించేందుకు అవసరమైతే వెంటనే హైదరాబాద్ కు తరలించి చికిత్స అందచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.