Telangana : రేపు పదోతరగతి పరీక్ష ఫళితాలు
రేపు మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి
పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంద్ర భారతి లో పదవ తరగతి పరీక్ష పలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారుల తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పదోతరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
సప్లిమెంటరీ పరీక్షలు కూడా...
ఫలితాల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. పరీక్ష ఫలితాలు వెలువడిన రోజునే సప్లిమెంటరీ పరీక్షల తేదీని కూడా విద్యాశాఖ అధికారులు ప్రకటించనున్నారు. నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు జరపడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. లక్షల సంఖ్యలో హాజరైన విద్యార్థులకు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి స్వయంగా ఫలితాలను విడుదల చేయనున్నారు.