Telangana : ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కు బీజేపీ చీఫ్ సంఘీభావం

తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్స్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ని కలిశారు.

Update: 2025-09-12 07:37 GMT

తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్స్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ని కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు, సవాళ్లు గురించి వివరించారు. ఈ రంగంపై 1,50,000కి పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. కేబుల్ ఆపరేటర్స్ సమస్యలను పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ రాంచందర్ రావు భరోసా ఇచ్చారు. రేపు ఇందిరా పార్క్ లో తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో జరగనున్న ధర్నాకు బిజెపి మద్దతు ప్రకటించింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్స్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వెల్లడించిన రాంచందర్ రావు, కేబుల్ ఆపరేటర్స్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో చాలా నష్టాల్లో ఉన్నారని, హైదరాబాద్‌లోని రామంతాపూర్ శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు జరిగిన దుర్ఘటన తర్వాత కేబుల్ ఆపరేటర్స్‌ను ఇబ్బందిపెట్టేలా, ఉపాధి కోల్పోయేలా పరిస్థితి సృష్టించారని తెలిపారు.

రేపు ధర్నాకు రావాలంటూ...
లక్షా 50 వేల మంది కేబుల్ ఆపరేటర్స్, సిబ్బంది ఉన్న ఈ చిన్నపాటి ఇండస్ట్రీపై అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, పలు ప్రాంతాల్లో కేబుల్ వైర్లు కట్ చేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీంతో లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్స్ నష్టపోయే ప్రమాదం ఉంది. ఉపాధి కోల్పోతున్నారని తెలిపార. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా సేవలు వినియోగదారులకు అందేలా చూడాలని, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్న ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను చూపించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం ఆప్టిక్ ఫైబర్ కనెక్షన్లను కేబుల్ ఆపరేటర్స్‌కు అందిస్తూ, వారి వద్ద రెంట్ తీసుకుంటూ, వారు సేవలు అందించడానికి సహాయం చేస్తోందని తెలిపారు. తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆప్టిక్ ఫైబర్ సౌకర్యాలను కేబుల్ ఆపరేటర్స్‌కు అందిస్తే, వారికి మేలు జరగవచ్చని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అన్నారు.


Tags:    

Similar News