ప్రేయసిని మరిచిపోలేక.. రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

ప్రేయసిని మరిచిపోలేక రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కంది మండల కేంద్రంలోని జిల్లా జైలులో

Update: 2022-02-15 05:12 GMT

ప్రేయసిని మరిచిపోలేక రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కంది మండల కేంద్రంలోని జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న ఖైదీ భానుచందర్(24) సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. భానుచందర్ ఆత్మహత్యకు యత్నించిన విషయం తోటి ఖైదీలు జైలు అధికారులకు తెలియజేయగా.. వెంటనే సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భానుచందర్ మృతి చెందాడు. భానుచందర్ ఆత్మహత్యాయత్నం చేసి చనిపోయాడని జైలు అధికారులు చెబుతున్నా.. అతని కుటుంబ సభ్యులు మాత్రం భానుచందర్ మృతిపై అనుమానాలున్నాయని తెలిపారు. సంగారెడ్డి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. రెండేళ్ల క్రితం వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన భాను చందర్ స్వర్ణలత అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు వారి కాపురం సజావుగానే సాగినా.. ఆ తర్వాత మనస్పర్థలు తలెత్తాయి. దాంతో స్వర్ణలత ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురి చావుకు కారణం భాను చందర్ అని స్వర్ణలత కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడంతో.. అతడిపై హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి కంది జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. ఫిబ్రవరి 14, సోమవారం ప్రేమికుల రోజు కావడంతో.. తన ప్రేయసిని మరిచిపోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News