వరంగల్ కు రాహుల్ గాంధీ
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం వరంగల్ జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత సాయంత్రం 5.30 గంటలకు చాపర్‌లో హనుమకొండకు చేరుకుంటారు. సాయంత్రం 5.30 కి సుప్రభ హోటల్ లో కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ హనుమకొండకు వస్తున్నట్లు తెలుస్తోంది.
రాత్రి 7.30 గంటలకు రైలులో చెన్నైకి వెళ్తారు. వరంగల్ పర్యటనలో ఆయన తెలంగాణకు చెందిన సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ పర్యటనపై పార్టీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు, పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. రాహుల్ గాంధీ పర్యటనతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.