Telangana : మరో ప్రయివేటు బస్సు కు ప్రమాదం
తెలంగాణలో మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అవుటర్ రింగ్ రోడ్డులో బస్సు బోల్తాపడింది
తెలంగాణలో మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అవుటర్ రింగ్ రోడ్డులో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇరవై మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. మియాపూర్ నుంచి గుంటూరుకు వెళుతున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు అవుటర్ రింగ్ రోడ్డు వద్ద బోల్తా పడింది. ప్రమాదం సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులున్నారు.
గాయాలయిన...
వారిలో ఎక్కువ మందికి గాయాలయ్యాయి. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. అతి వేగంగా నడుపుతూ అవుటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదానికి కారణమయ్యారని ప్రయాణికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.