Telangana : నేడు తెలంగాణలో ప్రైవేట్ కళాశాలల బంద్
నేడు తెలంగాణలో ప్రైవేట్ కళాశాలల బంద్ జరగనుంది. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపు నిచ్చింది.
నేడు తెలంగాణలో ప్రైవేట్ కళాశాలల బంద్ జరగనుంది. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపు నిచ్చింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరతూ ప్రయివేటు కళాశాలల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. టోకెన్ ఇచ్చిన 1800 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ నిధులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఫీజు రీ ఎంబర్స్ మెంట్ నిధులు...
ఈరోజు ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత పూర్తి స్థాయి బంద్ పై కళాశాలల యాజమాన్యం నిర్ణయం తీసుకోనుంది. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యంతో నేడు ప్రభుత్వం చర్చలు జరపనుంది. తమకు రావాల్సిన బకాయీలు చెల్లించకపోతే ఈ నెలలోనే లక్షలాది మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, కళాశాలలను బంద్ చేస్తామని కళాశాలల యాజమాన్యం ప్రకటించింది.