స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. గ్రాముకు ఎంతంటే?

తాజాగా బంగారం ధర గ్రాముకు ముప్ఫయి రూపాయలు పెరిగింది. పది గ్రాములకు మూడు వందలు పెరిగింది.

Update: 2021-12-05 01:43 GMT

బంగారం ధరలు ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ను బట్టి పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. అంతర్జాతీయంగా ప్రభావం చూపే అంశాలు బంగారం ధరలను నిర్ణయిస్తాయి. అందుకే బంగారం ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుగోలు చేసేందుకు అనేక మంది ముందుకు వస్తుంటారు. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ బంగారం కొనుగోళ్లు తగ్గలేదంటే దానిపై భారతీయులకు ఉన్న మోజును అర్థం చేసుకోవచ్చు.

పెరిగిన ధరల ప్రకారం....
ఇక తాజాగా బంగారం ధర గ్రాముకు ముప్ఫయి రూపాయలు పెరిగింది. పది గ్రాములకు మూడు వందలు పెరిగింది. పెరిగిన ధరలు ప్రకారం హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 44,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,820 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News