నిజామాబాద్ లో పెద్దపులి
నిజామాబాద్ తాటిమల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది.
నిజామాబాద్ తాటిమల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జిల్లా నుంచి ఈ పెద్దపులి ఇక్కడకు వచ్చి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పాదముద్రల ఆధారంగా మగ పెద్దపులిగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఎస్ 12 పెద్దపులిగా గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఎవరూ రావద్దంటూ...
ఎవరూ ఇటువైపు రావద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను మేతకు, పొలాల పనులకు ఒంటరిగా రావద్దని, ఉదయం,సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత మాత్రం ఈ ప్రాంతంలో సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పెంపుడు జంతువులను కూడా బయటకు వదలకుండా ఇళ్లలోనే ఉంచాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు.