మరోసారి తెరపైకి పుల్లారెడ్డి స్వీట్స్ కుటుంబ వివాదం.. రాష్ట్రపతికి ప్రజ్ఞా లేఖ

రాఘవరెడ్డి, భారతిరెడ్డి, శ్రీవిద్యారెడ్డి గత రెండేళ్లుగా తనను, తన ఎనిమిదేళ్ల కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని..

Update: 2022-12-26 12:37 GMT

pragna reddy letter to president

పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కుటుంబ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. గతంలో పుల్లారెడ్డి మనుమడు ఏక్ నాథ్ రెడ్డి తనను వేధిస్తున్నారంటూ ప్రజ్ఞారెడ్డి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనను ఒక గదిలో బంధించి.. బయటికెళ్లే వీల్లేకుండా గోడను నిర్మించారని ప్రజ్ఞా పోలీసులకు తెలుపగా.. పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. తాజాగా మరోసారి వీరి వివాదం తెరపైకొచ్చింది. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, వారి కుమార్తె శ్రీవిద్యారెడ్డిల నుంచి తనను కాపాడాలంటూ ఆ ఇంటికోడలైన ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాసింది.

రాఘవరెడ్డి, భారతిరెడ్డి, శ్రీవిద్యారెడ్డి గత రెండేళ్లుగా తనను, తన ఎనిమిదేళ్ల కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ప్రజ్ఞారెడ్డి ఆ లేఖలో ఆరోపించారు. వారు గతంలో తనను వరకట్నం కోసం హింసించారని, తనను గదిలోంచి బయటికి రానివ్వకుండా రాత్రికి రాత్రే గోడ కట్టేశారని వివరించారు. కోర్టు స్పందించి, ఆ గోడ కూల్చేయాలని చెప్పిందని ప్రజ్ఞారెడ్డి వివరించారు. తనను, తన కుమార్తెను చంపేందుకు కూడా ప్రయత్నించినట్లు ప్రజ్ఞారెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. తన అత్తైన భారతి రెడ్డిపై హైదరాబాద్ లో భూ కబ్జా కేసులు కూడా ఉన్నాయని ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సాటి మహిళగా.. తన వేదనను అర్థం చేసుకుని న్యాయం చేస్తారని నమ్మి లేఖ రాస్తున్నానని, తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు.




Tags:    

Similar News