Padi Koushik Reddy : కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మొహరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఎన్.ఎస్.యూ.ఐ, కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటి ముట్టడికి పిలుపు నివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న దానిపై ఆయనపై కేసు నమోదు చేశారు.
రెండు పార్టీల కార్యకర్తలు...
దీంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోవడం, అటు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరడంతో పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు. అక్కడకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను పంపించి వేస్తున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ఇంటివద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.