రాజ్‌భవన్ ఉద్యోగి శ్రీనివాస్ అరెస్ట్
తెలంగాణలో రాజ్‌భవన్ ఉద్యోగి శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు
తెలంగాణలో రాజ్‌భవన్ ఉద్యోగి శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళను వేధించిన కేసులో గతంలోనూ అరెస్ట్ అయిన శ్రీనివాస్ తాజాగా రాజ్ భవన్ లో హార్డ్ డిస్క్ లను చోరీ చేశారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా ఉద్యోగి ఫొటోలను గతంలో మార్ఫింగ్ చేసిన శ్రీనివాస్ కంప్యూటర్‌లో ఇంకా ఫొటోలు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగారంటూ పోలీసులు తెలిపారు.
హార్డ్ వేర్ ఇంజినీర్ గా..
ఈ నెల 12న అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు విచారించి కోర్టులో హాజరు పర్చారు. అయితే బెయిల్‌పై రాగానే రాజ్‌భవన్‌కు వెళ్లిన శ్రీనివాస్ చోరీ తర్వాత మరో హార్డ్‌డిస్క్ శ్రీనివాస్ అమర్చారు. రాజ్ భవన్ లో హార్డ్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ను గతంలో నమోదయిన కేసుల పై విధుల నుంచి సస్పెండ్ చేశారు. తిరిగి శ్రీనివాస్ ను ఈ నెల 16న అరెస్ట్ చేశారు. అయితే హార్డ్ డిస్క్ లన్నింటినీ శ్రీనివాస్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.