పెంపుడు కుక్క గోరు గుచ్చుకొని

పెంపుడు కుక్క పిల్ల కాలి గోరు గుచ్చుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువకుడు రేబిస్‌ సోకి మరణించాడు.

Update: 2025-09-24 10:45 GMT

పెంపుడు కుక్క పిల్ల కాలి గోరు గుచ్చుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువకుడు రేబిస్‌ సోకి మరణించాడు. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన ముత్తెబోయిన సందీప్‌ రెండు నెలలు క్రితం ఓ కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకున్నాడు. దానిని మచ్చిక చేసుకునే క్రమంలో కుక్కపిల్ల సందీప్‌ తండ్రి పున్నయ్యను కరిచింది. అలాగే సందీప్ కు కూడా ఆ కుక్కకాలి గోరు గుచ్చుకుంది. వెంటనే, తన తండ్రికి పినపాక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. అయితే తనకు కాలి గోరే కదా గుచ్చుకుందని నిర్లక్ష్యం చేశాడు. గొర్రెలు కాచుకుంటున్న క్రమంలో అతనికి రేబీస్‌ లక్షణాలు కనిపించాయి. కుటుంబసభ్యులు పలు ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. వ్యాధి ముదిరి సందీప్‌ మృతి చెందాడు.

Tags:    

Similar News