Revanth Reddy : ఒకటే లెక్క పధ్నాలుగు పక్కా.... హరీశ్ రాజీనామాకు రెడీగా ఉండు

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా పథ్నాలుగు స్థానాల్లో గెలుస్తామని పీసీీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2024-04-26 06:51 GMT

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా పధ్నాలుగు స్థానాల్లో గెలుస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టెస్ట్, వన్డే మ్యాచ్‌ల ఫార్మాట్ మారిపోయిందన్నారు. ఇప్పుడు టీ 20 ఫార్మాట్ విజయవంతగా నడుస్తుందనిఅ న్నారు. సెమీ ఫైనల్లో కేసీఆర్ ను ఓడించామని, ఫైనల్స్ లో మోదీని ఓడించబోతున్నామని తెలిపారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమని, సోషల్ మీడియా వారియర్స్ కూడా ఇప్పుడు మేలుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. దేవుడు గుడిలో ఉండాలని, భక్తి మనస్సులో ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు.

హరీశ్ సవాల్ ను స్వీకరిస్తున్నా...
దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు.నాలుగు వందల స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని అన్నారు. పండగలు వస్తే బీజేపీ సమస్యలను సృష్టిస్తుందన్నారు. బీజేపీ భావాజాలం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందన్నారు. బీజేపీ అంటే భారీతయ బ్రిటీష్ పార్టీ అని అన్నారు. హరీశ్ సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోగా రెండు లక్షల రైతుల రుణాన్ని మాఫీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, రాజీనామాకు రెడీగా ఉండు అని హరీశ్ కు సవాల్ విసిరారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News