Pawan Kalyan : కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్‌ కల్యాణ్‌ చేరుకున్నారు

Update: 2026-01-03 06:25 GMT

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్‌ కల్యాణ్‌ చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల వసతుల కోసం నిర్మించనున్న 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మందిరానికి ప‌వ‌న్‌ కల్యాణ్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నిర్మాణాలకు భక్తుల విరాళాల ద్వారా రూ.35.19 కోట్లు సమకూరినట్లు అధికారులు తెలిపారు.

భారీ బందోబస్తు...
కొండగట్టు ఆలయ సందర్శనానికి పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఆలయ దర్శనం అనంతరం నాచుపల్లిలోని ఓ రిసార్ట్‌లో జనసేన పార్టీ కార్యకర్తలతో ప‌వ‌న్‌ కల్యాణ్‌ సమావేశం కానున్నారు. మధ్యాహ్నానికి హైదరాబాద్‌కు తిరిగివెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.


Tags:    

Similar News